కోటబొమ్మాళి మండలానికి 1000 క్వింటాల వేరుశనగ విత్తనాలు అందుబాటులోకి వచ్చాయని వ్యవసాయశాఖ అధికారి ఎస్ గోవిందరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం మండలంలోని నిమ్మాడ గ్రామంలో మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కింజరాపు హరిప్రసాద్ చేతుల మీదుగా రైతులకు విత్తనాలను పంపిణీ చేశామని ఆయన తెలిపారు. 30 కేజీల బస్తా రాయితీలు పోను రూ. 1730 అని ఆయన పేర్కొన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.