ప్రభుత్వ విప్ గా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్
రాష్ట్ర ప్రభుత్వ విప్ గా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ను ప్రభుత్వం నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇచ్ఛాపురం టీడీపీ ఎమ్మెల్యే గా వరుసగా మూడోసారి గెలిచిన అశోక్ ను ప్రభుత్వ విప్ గా నియమించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల కేటాయింపులో భాగంగా అశోక్ కు ప్రభుత్వ చీఫ్ విప్ వరించింది.