రాష్ట్రంలో రైస్ కార్డు ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారులకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇచ్చాపురం నియోజకవర్గం ఈదుపురంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి 55 లక్షల మంది రైస్ రేషన్ కార్డుదారులు ఉన్నారని తెలియజేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకాన్ని వర్తింప చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.