ఇచ్ఛాపురం: జానకికి 3సెంట్ల ఇంటి పట్టా అందజేసిన కలెక్టర్
ఇచ్చాపురం మండలంలోని ఈదుపురం గ్రామానికి చెందిన బలిజపల్లి జానకికి సీఎం చంద్రబాబు హామీ మేరకు 3 సెంట్ల ఇళ్ల స్థలాన్ని మంజూరు చేశారు. ఈ మేరకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ కలసి గురువారం ఇంటి పట్టా అందజేశారు. దీపం 2 పథకాన్ని ప్రారంభించేందుకు ఇటీవల ఈదుపురం వచ్చిన సీఎం చంద్రబాబు ఒంటరి మహిళ అయిన జానకికి పెన్షన్ తో పాటు ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.