శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబును ప్రభుత్వ విప్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు. ఈ నిర్ణయంతో కంచిలి కూటమి శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం బుడ్డెపు కామేష్ రెడ్డి, టీవీ రమణ, పిలక చిన్న బాబు, సనపల కామేష్ తదితరులు అశోక్ బాబును మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు. ముఖ్యంగా, ఇచ్చాపురం నియోజకవర్గాన్ని గౌరవించడంతో చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.