సోంపేట మండలం జింకిభద్ర గ్రామానికి చెందిన యజ్ఞల గోపమ్మ, తన కోడలు తులసమ్మతో కలిసి ఉంటుంది. అయితే అనారోగ్యం కావడంతో గోపమ్మ మంగళవారం మృతి చెందింది. గోపమ్మకు అంత్యక్రియలు చేయడానికి కుమారుడు, కుమార్తె ఉపాధి కోసం బెంగళూరుకు కూలి పనులకు వలస వెళ్లారు. కుమారుడు ప్రసాద్ అందుబాటులో లేకపోవడంతో కోడలు తులసమ్మ అత్త గోపమ్మకు గ్రామస్థుల సహాయ సహకారాలతో తలకొరివి పెట్టింది.