కవిటి మండలం 104లో పనిచేస్తున్న సిబ్బంది, మూడు నెలలుగా జీతాలు సరిగా ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోయారు. పీఎఫ్ విషయంలో కూడా అవకతవకలు ఉన్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా 104 సిబ్బంది ఎం. సంతోష్, పి. రాజేంద్ర నాయక్, బెలగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు రాకేశ్‌కు మంగళవారం వినతి పత్రం అందజేసి, వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని కోరారు.