ఇటీవల ఈదుపురంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో బహిరంగంగా బెంతు ఒరియా సమస్యని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి దృష్టికి తీసుకెళ్లిన స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబుకి బెంతు ఒరియా సంఘం సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు రామయ్య పుట్టుగలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఎమ్మెల్యేను కలిసి పుష్పగుచ్ఛంతో కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.