ఎచ్చెర్ల నాగార్జున అగ్రికం కార్మికులు, ఉద్యోగుల ఔదార్యాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి. తేజేశ్వరరావు, నసీర్ ఇండస్ట్రీస్ వైస్ ప్రెసిడెంట్ కే. శేషగిరిరావు అభినందించారు. నాగార్జున అగ్రికం పరిశ్రమలో పనిచేస్తూ కార్మికుడు సుతారి రాజేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. బుధవారం మృతుని కుటుంబానికి ఎన్ ఎ సి ఎల్ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు యావన్మంది తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా వసూలు చేసి అందజేశారు.