కోటబొమ్మాలి మండలం హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్ యార్డ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే స్టేషన్ ఎస్ఐ ఎస్. కె షరీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. ట్రైన్ నెంబర్ 22881 భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైల్ నుంచి శుక్రవారం పడిపోయి గాయాలతో మరణించినట్లు తెలిపారు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించామన్నారు. చనిపోయిన వ్యక్తికి సుమారు 35 సంవత్సరాల వయస్సు ఉంటుందని తెలిపారు.