సీఎం నారా చంద్రబాబు నాయుడును పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గురువారం రాష్ట్ర సచివాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు వంశధార నిర్వాసితులకు న్యాయం చేసే విధంగా ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించి లిఫ్టు ఇరిగేషన్ ఏర్పాటు, రహదారుల నిర్మాణం, మరమ్మత్తులకు నిధులు కేటాయించాలని సీఎం ను ఎమ్మెల్యే కోరారు.