విశాఖపట్నంలో గ్యాంగ్ రేప్ బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. మెళియాపుట్టి మండలం చాపర గ్రామంలో వీవోఏ, అంగన్వాడీ సంఘాల ద్వారా శుక్రవారం ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ మహిళలపై నేరాలు రోజురోజుకు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.