తుపాను ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎల్. ఎన్. పేట వ్యవసాయ అధికారిణి పైడి లతశ్రీ శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. కొన్ని రోజులుగా ఖరీఫ్ వరి చేను కోతలు ముమ్మరంగా జరుగుతున్నందున పంటను కాపాడుకునే పనులు చేయాలన్నారు. పంట కోతలను వాయిదా వేసుకోవాలని కోరారు. రబీలో విత్తనాలు వేసుకునే పనులను వాయిదా వేయాలని సూచించారు.