పలాస నియోజకవర్గంలో మంగళవారం టీడీపీ సానుభూతిపరులపై దాడి జరగ్గా పలువురు గాయపడ్డారు. బాధితుల వివరాల ప్రకారం. వజ్రపుకొత్తూరు మండలం పాత టెక్కలి గ్రామానికి చెందిన గంగయ్య గతంలో టీడీపీ కోసం పనిచేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని గ్రామానికి చెందిన కొందరు వైసీపీ కార్యకర్తలు గంగయ్యతో పాటు ఆయన భార్యపై దాడి చేశారు. అడ్డుకున్న కుమారుడు గిరిపై కూడా దాడి చేయడంతో గాయపడ్డారు. పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.