సోంపేట మండలం బారువకొత్తూరు గ్రామానికి చెందిన మత్స్యకారుడు రట్టి అప్పన్న(53) బుధవారం సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడి మృతి చెందాడు.గ్రామానికి చెందిన నలుగురు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు.ప్రమాదవశాత్తు పడవ బోల్తాపడగా అప్పన్న సముద్రంలో కొట్టుకుపోయాడని తీరానికి చేరుకున్న ముగ్గురు మత్స్యకారులు తెలిపారు.అప్పన్న మృతదేహం గొల్లగండి తీరానికి కొట్టుకొచ్చింది.