పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న కంటైనర్ వాహనాన్ని పైడిభీమవరం చెక్ పోస్టు వద్ద శనివారం జె. ఆర్ పురం ఎస్ఐ చిరంజీవి తన సిబ్బందితో పట్టుకున్నారు. చింతాడ నుంచి తునికి 19 పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేశారు. పశువులను గోశాలకు తరలించారు.