రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టు వద్ద నిఘా పెంచాలని పోలీసు సిబ్బందిని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ శనివారం ఆదేశించారు. విడపనకల్ మండలం పాల్తూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లో లాకప్ గదులు, రికార్డులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కర్ణాటక మద్యం జిల్లాలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. బాల్య వివాహాలు, సైబర్ నేరాలపై అవగాహన సదస్సులు పెట్టాలని సూచించారు.