వజ్రకరూరు మండలంలో పల్లె పండుగ పంచాయితీ వారోత్సవాల్లో,ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో భాగంగా, జనసేన మండల కన్వీనర్ అచ్చనాల కేశవ ఆధ్వర్యంలో గంజికుంట,తత్రకల్ తాండ గ్రామాల్లో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీడీపీ కన్వీనర్ వెంకటేష్ మాట్లాడుతూ, పల్లెల అభివృద్ధి ద్వారా రైతుల అభివృద్ధి సాధ్యమని, పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారని తెలిపారు.