వజ్రకరూరు మండల రాగులపాడు గ్రామంలో ఉన్న శివాలయంలో గత మూడు రోజులుగా ప్రత్యేక అలంకరణలు, పూజలు అందుకున్న గౌరి దేవి విగ్రహాన్ని ఆదివారం అంగరంగ వైభవంగా గ్రామస్తుల ఆధ్వర్యంలో ఊరేగింపు చేశారు. అనంతరం నిమజ్జనం చేసారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.