ప్రభుత్వం విధానాలకనుగుణంగా ఆన్లైన్ మద్యం ప్రక్రియను సక్రమంగా చేపట్టాలని అనంతపురం ఏఈఎస్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఎక్సైజ్ స్టేషన్ను సందర్శించారు. పలు రికార్డులను పరిశీలించారు. ఎప్పటికప్పుడు సరిహద్దుల్లో అక్రమ మద్యం రవాణాపై అధికారులు గట్టి నిఘా ఉంచాలని సూచించారు.