ఉరవకొండ పట్టణంలో ఉన్న విద్యుత్ కార్యాలయం ఎదుట సిపిఎం నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మధుసూదన్నాయుడు, రంగారెడ్డి మాట్లాడుతూ.. విద్యా, వైద్యం ఖర్చులతో ప్రజలు కుదేలవుతున్నారని ఆరోపించారు. దీనికి తోడు ఇంధన సర్దుబాటు చార్జీల పేరిట రూ. 6072 కోట్లు భారాన్ని వ్యతిరేకించారు. విద్యుత్ వినియోగదారులకు ఇది పెనుబారంగా మారిందన్నారు.