సింగనమల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీల అభివృద్ధి కొరకు సమగ్రమైన ప్రణాళికలు తయారు చేయాలని జిల్లా పరిషత్ సీఈఓ వెంకటసుబ్బయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ సర్పంచులకు, ఎంపీటీసీలకు, పంచాయతీ కార్యదర్శులకు జరుగుతున్న గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు 2025-2026 శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.