కౌలు రైతు పత్రాలు పొందిన వారు బ్యాంక్ ద్వారా రుణాలు పొందవచ్చని అనంతపురం జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ పేర్కొన్నారు. శనివారం శింగనమల మండలం కేంద్రంలోని రైతు సేవా కేంద్రంలో కౌలు రైతులకు అవగాహన కల్పించారు. కార్డు కలిగిన వారికి రూ. 1. 60 లక్షల వరకు రుణాలు ఇస్తారని తెలిపారు. కార్యక్రమంలో లిడ్ బ్యాంక్ మేనేజర్ నరసింహ రావు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.