నార్పల: 'ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి'

77பார்த்தது
నార్పల: 'ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి'
నార్పల మేజర్ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ సుప్రియ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. సభకు జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు నాగరత్నమ్మ, ఈఓఆర్డీ శైలజ రాణి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ. ప్రభుత్వం మండలాన్ని కరవు మండలంగా ప్రకటించిందని చెప్పారు. కూలీలు వలసలు వెళ్లకుండా పనులను గుర్తిస్తామని అన్నారు. కూలీలు ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி