డి. హిరేహాల్ మండలం కాదలూరు-దొడగట్ట గ్రామాల మధ్య గల రహదారి వర్షాల కారణంగా దెబ్బతిని వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. మంగళవారం కళ్యాణదుర్గం ఇన్ ఛార్జి రెవెన్యూ డివిజనల్ అధికారి వినూత్న దెబ్బతిన్న రహదారిని పరిశీలించారు. రహదారి మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.