చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామంలో గురువారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఘనంగా నిర్వహించారు. స్థానిక గ్రామీణ యునాని వైద్యశాలలో డాక్టర్ ఖాదర్ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఖాదర్ మాట్లాడుతూ స్వతంత్ర భారత మొదటి హోం మంత్రిగా దేశాన్ని ఏక ఖండంగా తీర్చిదిద్దిన సమైక్యవాది సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అన్నారు.