శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు ఆదివారం గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించారు. ఎలాంటి గొడవలకు వెళ్లకుండా ప్రజలు ప్రశాంతంగా జీవించాలని, అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఏమైనా సమస్యలు ఉంటే పోలీసులు దృష్టికి తీసుకురావాలని గ్రామ ప్రజలకు తెలియజేశారు. రౌడీ షీటర్లు పాత నేరస్థలను పోలీస్ స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. గ్రామాలలో సమస్యలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.