తాడేపల్లి హైవేపై చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో బుధవారం తీవ్రంగా గాయపడిన మహిళలను మంత్రి సవిత స్పందించి తన సొంత వాహనంలో ఆసుపత్రికి తరలించారు. మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను మంత్రి పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యమందించాలని వైద్యులకు ఆదేశించారు.