రొళ్ళ మండల పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం రొళ్ళ తహసీల్దారు కార్యాలయంలో సోమవారం (నేడు) ఉదయం 10. 00 గంటల నుండి మద్యాహ్నం 2. 00 గంటల వరకూ శాసన సభ్యులు ఎం. ఎస్. రాజు ఆద్వర్యంలో ప్రజా దర్బార్ ను జరుగును. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొంటారు. కావున రొళ్ళ మండల పరిధిలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో వ్రాసుకుని అందులో అర్జీ దారుని ఆధార్ నెంబరు మరియు ఫోన్ నెంబర్లను జతపరచాలని కోరారు.