ప్రతి పేద కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ధ్యేయం అని మడకశిర ఎమ్మెల్యే ఎం. ఎస్ రాజు పేర్కొన్నారు. శుక్రవారం మడకశిర పట్టణంలోని అమరాపురం బస్టాండు వద్ద మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి,
తెదేపా రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి పాల్గొని గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు.