కళ్యాణదుర్గం పట్టణం రెవెన్యూ కాలనీలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్, కరణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన రహదారిలో మద్యం షాపు ఏర్పాటు చేయడాన్ని అఖిల భారత విద్యార్థి సమాఖ్య తీవ్రంగా ఖండించింది. గురువారం వందలాది మంది విద్యార్థులతో ర్యాలీ చేపట్టి షాపు ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. షాపును తీసివేయకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.