అనంతపురం ప్రీమియర్ లీగ్ అండర్-15 బాలుర క్రికెట్ పోటీలో ఆదివారం తాడిపత్రిలో జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన తాడిపత్రి టీం 40 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. అనంతరం కళ్యాణదుర్గం టీం 23 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసి ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో కళ్యాణదుర్గం పట్టణ వాసులు క్రికెట్ లో గెలిచిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.