కుందుర్పి మండలం బెస్తరపల్లికి చెందిన తిప్పేస్వామి పొలంలో కరెంట్ తీగలు చేతికి అందేఎత్తులో ఉన్నాయని సోమవారం విలేఖరులకు తెలిపారు. పలుమార్లు అధికారుల విన్నవించినా నిమ్మకు నీరెత్తిన విధంగా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ పనులు చేయించుకోవాలంటే తమ ప్రాణాలను అరిచేతులో పెట్టుకుని పనులు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొన్నదని వాపోయారు. మాకు ఎలాంటి ప్రమాదం జరిగినా విద్యుత్ అధికారులే కారణమని రైతు తెలియజేశారు.