కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో బుధవారం పౌర హక్కుల దినోత్సవం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు. కార్యక్రమానికి సర్పంచ్ శోభారాణి అధ్యక్షత వహించారు. తహశీల్దార్ భాస్కర్ మాట్లాడుతూ చట్టం అందరికీ సమానమని గ్రామాలలో ఎక్కడ కుల వివక్షత చూపకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం కమిటీ సభ్యులు మోహన్, ఎస్సీ కాలనీ ప్రజలు, ఎంపీడీవో రామచంద్ర, సీఐ నీలకంఠేశ్వర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.