కదిరి మున్సిపాలిటీ పరిధిలోని ఖాజా నగర్ లో మూడ్రోజుల క్రితం హసీనా (46) విష ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హసీనా మృతికి కారణమైన నిందితుడు ఇర్ఫాన్ ను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు.