నల్లచెరువు మండలంలో ప్రసిద్ధిగాంచిన పాలపాటి దిన్నే ఆంజనేయస్వామిని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ శనివారం దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన ఎమ్మెల్యేకి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఆంజనేయస్వామివారి చల్లని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేని ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటంతో సత్కరించారు.