పేదలకు గ్రామాలలో 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం కదిరి పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఈ నెల 18వ తేదీన ఇళ్ల స్థలాల కోసం సిపిఐ ధర్నా పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల చొప్పున మంజూరు చేయాలని కోరారు. గ్రామ సచివాలయాల వద్ద ఆందోళన చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.