తలుపుల మండల కేంద్రంలో రైతులు, ప్రజలు వర్షం కోసం బుధవారం గాడిదలకు పెళ్లి చేశారు. గాడిదల జంటను తలుపుల ప్రధాన రహదారి వద్ద గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని రోజులుగా వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండిపోయే దశలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరుణ దేవుడు కరుణించి వర్షం కురిపించాలన్న నమ్మకంతో గాడిదలకు పెళ్లి చేశామని తెలిపారు.