తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలని కదిరి జనసేన ఇన్ఛార్జ్ భైరవ ప్రసాద్ డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా కదిరిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో సోమవారం ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. అలాగే రేపు నరసింహస్వామి ఆలయంలో ఉదయం 10 నుంచి 1 గంట వరకు దీక్ష ఉంటుందని తెలిపారు.