నల్లచెరువు మండలం పాలపాటిదిన్నెలో వెలసిన సుప్రసిద్ధ శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో రిటైర్డ్ కలెక్టర్ వెంకటరమణ రెడ్డి, కుటుంబ సభ్యులు స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రావణ మాసం, శనివారం సందర్భంగా ఆలయానికి వచ్చిన వారికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించి ఘనంగా సన్మానించారు.