రక్తదానంతో ఎన్నో జీవితాలకు వెలుగులు నింపిన వారవుతామని హిందూపురం డిఎస్పీ కేవీ మహేష్ తెలిపారు. మంగళవారం పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా జిల్లా ఎస్పీ వి.రత్న ఆదేశాల మేరకు హిందూపురం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో డిఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీస్ సిబ్బందితో కలిసి యువత 41 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ రాజగోపాల్ నాయుడు, వైద్యులు పాల్గొన్నారు.