శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో గురువారం డీఎస్పీ మహేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత్రి 10 గంటలకే వ్యాపార సముదాయాలు మూసివేయాలని, రాత్రి 11 గంటల తర్వాత ఏలాంటి కారణం లేకుండా జనం సంచరించరాదని, వీటిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిఎస్పి మహేష్ వెల్లడించారు.