కుందుర్పి మండలం యర్రగుంట గ్రామంలో గురువారం టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమంను ఆ పార్టీ నాయకులు ముమ్మరంగా నిర్వహించారు. టిడిపి సభ్యత్వ నమోదును పెంచాలని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర బాబు సూచనలు మేరకు క్లస్టర్ ఇన్చార్జి బి. శివలింగప్ప ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి అవగాహన కల్పిస్తూ సభ్యత్వం కలిగిన కార్యకర్తలకు ప్రమాదవశాత్తు మరణిస్తే దహన సంస్కారాలకు పదివేల రూపాయలు, ఐదు లక్షల రూపాయలు భీమా వర్తిస్తుందని తెలిపారు.