గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో గురువారం బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ సూపర్వైజర్ నాగేశ్వరి, అంగన్వాడీ టీచర్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని చిన్నపిల్లల మధ్య ఘనంగా నిర్వహించారు. నెహ్రు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. స్వీట్లు, చాక్లెట్లు పిల్లలకు పంచిపెట్టారు.