నాటుసారాను రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. గుత్తి మండలంలోని బేతాపల్లి గ్రామ పొలాల నుంచి నాటు సారాను ఇతర ప్రాంతా లకు తరలిస్తున్నట్లు సమాచారం అందిందని, వెంటనే దాడులు నిర్వహించి నాటుసారాను తరలిస్తున్న బేతాపల్లికి నాగరాజు, సూరిని అరెస్ట్ చేశామని, అలాగే వారి వద్ద నుంచి 12 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నామని సీఐ చెప్పారు.