మద్యం దుకాణాల ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ.. మంగళవారం గుత్తి పట్టణంలోని మద్యం దుకాణాల వద్ద మద్యం దుకాణాలలో పనిచేసే ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మద్యం దుకాణాల పనిచేసే ఉద్యోగులు సునీల్ మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాలుగా మద్యం దుకాణాలలో పనిచేస్తూ జీవనం కొనసాగించామన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం తమకు ఉద్యోగాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆదుకోవాలని వారు కోరారు.