ధర్మవరం కొత్తపేట బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా బాలలపై లైంగిక వేధింపులపై అవగాహన కార్యక్రమం జరిగింది. సీడీపీఓ లక్ష్మీ బాలికలు అప్రమత్తంగా ఉండాలని, లైంగిక వేధింపులు ఎదురైతే 1098 లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీచర్లు, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు.