అనంతపురం జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి గురువారం పేర్కొన్నారు. అనంతపురం లో ఆయన మాట్లాడుతూ వైసీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని టీడీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారన్నారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులను కాపాడుకుంటామని, ఎవరూ అధైర్య పడాల్సిన పనిలేదని అన్నారు. ఏది ఏమైనా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ముందుకెళ్తామనితెలిపారు.