అనంతపురం నగరంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా దసరా సెలవు దినం కూడా నారాయణ, శ్రీ మాస్టర్స్, చైతన్య మరి కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు తరగతులు నిర్వహిస్తున్నారు. సెలవు దినాల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సైతం తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను మానసికంగా వేధిస్తున్న విద్యాసంస్థలను గురువారం పీ.డీ.ఎస్.ఓ నాయకులు బంద్ చేయించించి విద్యార్థులను ఇళ్లకు పంపారు.