భారతరత్న డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని రిజర్వేషన్ ఎంప్లాయిస్ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర శుక్రవారం డిమాండ్ చేశారు. అనంతపురం లో ఆయన మాట్లాడుతూ. దేశానికి ఆదర్శమైన బి. ఆర్ అంబేడ్కర్ జీవిత చరిత్రను ప్రభుత్వం భావి భారత పౌరులకు తెలిపేలా కృషి చేయాలని అన్నారు. కార్య క్రమంలో ఆర్ ఈ ఎఫ్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ వైస్ ఛైర్మన్ రామకృష్ణ, జిల్లా గౌరవాధ్యక్షుడు మల్లేష్ పాల్గొన్నారు.